కరీంనగర్ జిల్లా రామడుగు మండల పరిషత్ లో 65 మంది లబ్ధిదారులకు రూ. 65 లక్షలు విలువ చేసే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అందజేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుతో రాష్ట్రంలో బాల్యవివాహాలు నిలిచిపోయాయన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్... పేదింటి ఆడబిడ్డ పెళ్లి పరిస్థితిని స్వయంగా చూసి చలించి ఈ పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: దుబ్బాక ఓటమితో తెరాసలో అంతర్మథనం