ETV Bharat / state

దళితుల జీవితాల్లో జ్ఞానజ్యోతి వెలగాలి: సుంకె రవిశంకర్​

author img

By

Published : Apr 25, 2021, 6:07 PM IST

కరీంనగర్ జిల్లా గర్శకుర్తిలో డా. బీఆర్​ అంబేడ్కర్​ విగ్రహాన్ని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ ఆవిష్కరించారు. దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ambedkar statue in garshakurthy village
గర్శకుర్తిలో అంబేడ్కర్​ విగ్రహావిష్కరణ

దళితుల జీవితాల్లో జ్ఞానజ్యోతి వెలగాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తిలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రంలో దళితుల అభ్యున్నతికి ప్రత్యేకంగా రూ. 1000 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని ఎమ్మెల్యే తెలిపారు. బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదువుకునేందుకు గురుకుల పాఠశాలలను స్థాపించి ఒక్కో విద్యార్థిపై రూ. లక్షా 20 వేలు సంవత్సరానికి ఖర్చు చేస్తోందని తెలిపారు.

దళిత పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శిక్షణతో పాటు రాయితీలిచ్చి ప్రోత్సహిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ స్టడీ సర్కిల్​ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దళితుల సంక్షేమం కోసం పాటుపడుతున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: 'ఏడేళ్లలో ఇచ్చినా హామీలను తెరాస మరిచిపోయింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.