ETV Bharat / state

రైతుల విశ్రాంతి గదిని ప్రారంభించిన ఎమ్మెల్యే - అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్

కరీంనగర్ జిల్లా చొప్పదండి తహసీల్దార్ కార్యాలయంలో రైతుల విశ్రాంతి గదిని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్​ కలిసి ప్రారంభించారు.

MLA sunke ravi shankar
రైతుల విశ్రాంతి గదిని ప్రారంభించిన ఎమ్మెల్యే
author img

By

Published : Jun 3, 2021, 3:10 PM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండి తహసీల్దార్ కార్యాలయంలో రైతుల విశ్రాంతి గదిని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్​తో కలిసి ప్రారంభించారు. భూముల క్రయ, విక్రయాలు, భూ యాజమాన్య మార్పును సులభతరం చేసేందుకు ధరణి పోర్టల్​ని ప్రభుత్వం రూపొందించిందని ఎమ్మెల్యే అన్నారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే రైతులకు సౌకర్యం కల్పించేందుకు తగిన సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.

చొప్పదండిలో రూ.10 లక్షలతో నిర్మించిన విశ్రాంతి గది, మంచినీటి సౌకర్యం, టాయిలెట్స్, కార్యాలయ సుందరీకరణను ఆయన పరిశీలించారు. గతంలో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన వారు చెట్ల కింద ఎదురుచూసే పరిస్థితి ఇక ఉండదన్నారు. డిజిటలైజేషన్ వల్ల పనుల్లో వేగం పెరిగిందన్నారు. త్వరలోనే డిజిటల్ సర్వే కూడా ప్రారంభం కానుందని తెలిపారు. రామడుగులో 45 మంది లబ్ధి దారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఇదీ చూడండి: రోజుల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.