కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. చొప్పదండి మండలానికి చెందిన 34 మంది లబ్ధిదారులకు రూ.8 లక్షల 64 వేల రూపాయల చెక్కులను అందజేశారు.
సకాలంలో దరఖాస్తు చేసుకోవాలి...
పేద కుటుంబాలు మెరుగైన వైద్యం పొందటానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపకరిస్తోందన్నారు. ప్రైవేట్ వైద్యం పొందిన వారు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేసేందుకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : కరోనాతో వ్యక్తి మృతి.. రాత్రంతా ఇంటి ముందే ఉన్న మృతదేహం