కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ప్రభుత్వ పాఠశాలల స్వీపర్లకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న స్వీపర్లకు పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సరుకులు అందజేశారు.
చిరుద్యోగుల కోసం ఉపాధ్యాయుల దాతృత్వం ప్రశంసనీయమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భౌతిక దూరం పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు.
ఇవీ చూడండి: విశాఖ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి