ETV Bharat / state

కల్యాణలక్ష్మితో బాల్యవివాహాలు తగ్గుముఖం పట్టాయి: ఎమ్మెల్యే సుంకె

author img

By

Published : Feb 11, 2021, 12:02 PM IST

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో 35 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

MLA Ravishankar distributes Kalyana Lakshmi cheques to beneficiaries in Karimnagar district
'ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు'

కల్యాణలక్ష్మి పథకం నిరుపేద ఆడబిడ్డకు వరం లాంటిదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఈ పథకం అమలు చేయడంతోనే రాష్ట్రంలో బాల్యవివాహాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం​లో 35 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

అందుకే కల్యాణలక్ష్మి పథకం...

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గిరిజన కుటుంబంలో ఆడబిడ్డ పెళ్లికి ఓ కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందికర సంఘటనను ముఖ్యమంత్రి స్వయంగా చూశారని తెలిపారు. అందుకే కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.

దేశంలోనే ముందుంది...

రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆసరా పెన్షన్​ ద్వారా నిరుపేద కుటుంబాలకు ఎంతో చేయూత లభిస్తోందని తెలిపారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణ దేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా ముందుందని అన్నారు.

ఇదీ చదవండి: సాగు భళా.. రుణం డీలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.