కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండలో నిర్మాణ దశలో ఉన్న రెండు పడక గదుల ఇళ్లను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించారు. 69 మంది లబ్ధిదారుల కోసం చేపట్టిన డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనుల్లో నాణ్యతను తనిఖీ చేశారు. సిమెంటు, ఇసుక, ఇటుకలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
నిరుపేదల కోసం పది కాలాల పాటు నిలిచే విధంగా ఇల్లు ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం పనులు వేగవంతం చేసి పేదలకు త్వరగా అందించాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదల కల సహకారం చేయడానికి వీలుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నారని పేర్కొన్నారు.
- ఇదీ చూడండి: సుశాంత్ మృతిపై అధ్యయనానికి డాక్టర్ల బృందం