ETV Bharat / state

'ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్​ను అందించే స్థాయికి ఎదిగాం' - కరీంనగర్​ జిల్లా తాజా వార్తలు

ప్రస్తుతం ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్​ను అందించే స్థాయికి భారత్​ ఎదిగిందని... మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో కొవిడ్​ వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

MLA Rasamai Balakishan launch covid Vaccine Center in Manakondoor, Karimnagar District
ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్​ను అందించే స్థాయికి ఎదిగాం
author img

By

Published : Jan 18, 2021, 8:04 PM IST

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్​ను కనిపెట్టడమే కాకుండా దాన్ని ప్రపంచ దేశాలకు అందించే స్థాయికి భారత్​ ఎదిగిందని... మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మహమ్మారితో దేశ ప్రజలంతా ఏడాదిపాటు యుద్ధం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో కొవిడ్​ వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

ప్రపంచ దేశాలకు కొవిడ్​ వ్యాక్సిన్​ను అందించే స్థాయికి ఎదగడం గర్వంగా ఉందన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉన్న పారిశుద్ధ్య కార్మికులతో పాటు వైద్య సిబ్బందికి అంతా రుణపడి ఉన్నారని తెలిపారు. అందుకే ముందుగా వారికే వ్యాక్సిన్​ను అందజేయాలని ప్రధాని మోదీ నిర్ణయించారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు ముఖ్యమంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.