ETV Bharat / state

'రాజకీయ ప్రయోజనాల కోసం కాదు.. భావి తరాల కోసం'

ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేకున్నా.. కేవలం భవిష్యత్‌ తరాల బాగు కోసమే కేసీఆర్‌ హరితహారం కార్యక్రమం చేపట్టారని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. కరీంనగర్‌ జిల్లా వెదురుగట్ట గ్రామంలో హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

minister-ktr-about-haritha-haram-in-karimnagar
'రాజకీయ ప్రయోజనాల కోసం కాదు... భావితరాల కోసం'
author img

By

Published : Jul 8, 2020, 12:42 PM IST

Updated : Jul 8, 2020, 2:26 PM IST

మొక్కలు, అడవుల ప్రాధాన్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించినంతగా ఏ నాయకుడు గుర్తించ లేదని, హరితహారం కార్యక్రమానికి మరెవరూ ఇంతటి ప్రాధాన్యం ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్​ జిల్లాలోని వెదురుగట్ట గ్రామంలో జరిగిన హరితహారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రులు కమలాకర్, కొప్పుల ఈశ్వర్​తో కలిసి మొక్కలు నాటారు.

''హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడమే కాదు. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలు బతక్కపోతే ఆ సర్పంచ్ పదవి పోతుందని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మన భారత్​లో కేసీఆర్ మాత్రమే. మున్సిపల్​ చట్టంలో 10 శాతం బడ్జెట్​ను ఈ కార్యక్రమానికి కేటాయించిన ఘనత కేసీఆర్​దే. హరితహారం వల్ల ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేదు. కేవలం భవిష్యత్​ తరాల బాగు కోసమే ముఖ్యమంత్రి దీనిని చేపట్టారు.''

-మంత్రి, కేటీఆర్​

'రాజకీయ ప్రయోజనాల కోసం కాదు... భావితరాల కోసం'

'పల్లె ప్రకృతి వనాల' పేరిట జిల్లాలో చేపట్టిన కార్యక్రమం బాగుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అన్ని చోట్ల ఈ విధానం అమలు చేసేలా ప్రయత్నిస్తామని తెలిపారు.

ఇవీ చూడండి: గుజరాత్​లో వరద బీభత్సం.. నీట మునిగిన ఆలయం

Last Updated : Jul 8, 2020, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.