ETV Bharat / state

Harish rao campaign: 'ప్రజలను మోసం చేసే భాజపాకు ఎందుకు ఓటెయ్యాలి?' - తెలంగాణ వార్తలు

హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో కరీంనగర్ జిల్లా సింగాపూర్​లో మంత్రి హరీశ్ రావు ప్రచారం(Harish rao campaign) చేశారు. అభివృద్ధిని కాంక్షించే తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​కే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలను మోసం చేసే భాజపాకు ఎందుకు వేయాలని ప్రశ్నించారు.

Harish rao campaign, huzurabad by elections 2021
హరీశ్ రావు ప్రచారం, హుజూరాబాద్ ఉపఎన్నిక 2021
author img

By

Published : Oct 26, 2021, 2:25 PM IST

అభివృద్ధిని కాంక్షించే తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు(Harish rao campaign) విజ్ఞప్తి చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో కరీంనగర్ జిల్లా సింగాపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉద్యమ కాలం నుంచి సింగాపూర్ ప్రజలు అండగా నిలిచారని.... తనకు, సీఎం కేసీఆర్​కి అన్నం పెట్టిందని గుర్తు చేసుకున్నారు. పేద ప్రజలను ఆదుకునే పార్టీకి అండగా ఉండాలని కోరారు. ధరలు పెంచుతూ ప్రజలను మోసం చేసే భాజపాకు ఎందుకు ఓటు వేయాలని హరీశ్ ప్రశ్నించారు. ఈ ర్యాలీలో ప్రధానంగా గ్యాస్‌సిలిండర్‌, పెట్రోల్‌ పంపు ఫ్లెక్సీలను ప్రదర్శించారు.

ప్రచార హోరు

హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. మరొక్క రోజే గడువు ఉండటంతో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇంటింటా ప్రచారం, రోడ్‌షోలు, ఆత్మీయ సమ్మేళనాలతో ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు.

తెరాస ప్రచారంలో విభేదాలు

హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో తెరాసలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ఇల్లంతకుంట మండలం సిరిసేడులో ధూంధాం నిర్వహించిన తర్వాత తిరిగి వెళ్తుండగా కౌశిక్ రెడ్డి అనుచరులు.. కౌశిక్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో మరికొందరు యువకులు.. గెల్లు శ్రీనివాస్‌ జిందాబాద్ అని నినదించడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఆ కార్యక్రమానికి హాజరైన ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్ కార్యకర్తలకు నచ్చచెప్పాలని కౌశిక్‌రెడ్డికి సూచించారు. నినాదాలు చేస్తుండగానే కౌశిక్ రెడ్డి వెళ్లిపోయారు. ఆ తర్వాత గెల్లు శ్రీనివాస్‌ను అతని అనుచరులు భుజాలపై ఎత్తుకొని జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు మాట్లాడిన మంత్రి హరీశ్‌ రావు ఈటల రాజేందర్ పార్టీ కోసం ఏదో చేసినట్లు గొప్పగా చెబుతున్నారని ఆరోపించారు. కమలాపూర్ నుంచి దామోదర్‌రెడ్డిపై మొదటిసారి పోటీ చేసినప్పుడు ఈటల రాజేందర్‌ ఎవరికైనా తెలుసా అని ప్రశ్నించారు.

ఈటల విమర్శలు

తెలంగాణ ఉద్యమంలో అహర్నిశలు శ్రమించిన తనపై ఐదుగురు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు తోడేళ్లలా దాడిచేస్తున్నారని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. జమ్మికుంటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ ఉపఎన్నిక వల్ల నియోజకవర్గానికి ఎన్నో పథకాలు వచ్చాయని పునరుద్ఘాటించారు. చాలా సార్లు పదవులు పోతే ప్రజలు దూరమౌతారు.. కానీ తనకు మాత్రం ప్రజలు దగ్గరయ్యారని ఈటల తెలిపారు. దిల్లీలో దళిత ఉద్యోగులను దారుణంగా బూతులు తిట్టి, కొట్టి అవమానించిన.. మంత్రి హరీశ్ రావుకు హుజూరాబాద్ ఎన్నికల బాధ్యత అప్పగించడం సిగ్గుచేటని మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. అలాంటి హరీశ్‌ రావు దళిత బంధు గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హరీశ్​ రావు ఎన్ని కథలు పడ్డా కేటీఆర్‌ను సీఎం చేసి భవిష్యత్‌లో పార్టీ నుంచి బయటకు పంపిస్తారని గుర్తు చేశారు.

సింగాపూర్​లో హరీశ్ ఎన్నికల ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.