విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య ఉండే బంధం శాశ్వతమైందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పారమిత పాఠశాలలో నిర్వహించిన 24 వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాతృభాషను నేర్చుకోవడం, కాపాడుకోవడం చాలా ముఖ్యమని అన్నారు.
సవాళ్లను, ఒత్తిళ్లను ఎదుర్కొనేలా.. ఉన్నత విలువలు కలిగిన పౌరులను సమాజానికి అందివ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను వారికి ఇష్టమైన రంగంలో రాణించేందుకు ప్రోత్సహించాలని.. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు.
ఈ సందర్భంగా పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో తడి, పొడి చెత్తను వేరు చేస్తే.. డంపు యార్డు సమస్య రాదన్నారు. స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ కరీంనగర్ కోసం అందరూ సహకరించాలని మంత్రి కోరారు.
ఇదీ చూడండి : డీసీసీబీ, డీసీఎమ్మెస్ డైరెక్టర్ పదవులపై సీఎం కసరత్తు