భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నా.. ఎన్నికల(huzurabad by election) తర్వాత ఆ పార్టీలో ఉండే అవకాశం లేదని ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీశ్ రావు(minister harish rao) అన్నారు. మడిపల్లిలో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్,ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌తో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఆయన తమ పార్టీలో ఉండేటట్లు లేరని భాజపా వాళ్లే చెప్పుకుంటున్నారని ఆరోపించారు. భారత్ మాతాకీ జై అని నినాదం కూడా చేయడం లేదన్నారు. ఎంతసేపు తన గోడును చెప్పుకోవడం తప్ప చేసిందేమి లేదన్నారు.
ఆయన గోడు గురించి పట్టించుకోవల్సిన అవసరం లేదని మన గురించి ఎవరైతే ఆలోచిస్తారో వాళ్లకే ఓటు వేయాలని మంత్రి హరీశ్ సూచించారు. ఎన్నికలు(huzurabad by election) దగ్గర పడుతున్నాయని.. జాగ్రత్తగా కారు గుర్తుకే ఓటువేయాలని హరీశ్ రావు ఓటర్లను కోరారు. కారు గుర్తును పోలి రోడ్డు రోలర్‌తో పాటు చపాతి తయారీ యంత్రం కూడా ఉందని ఈ రెండింటితో మోసపోయే అవకాశం ఉందని మొన్న దుబ్బాకలో కూడా ఇలాగే జరిగిందని పేర్కొన్నారు. 2వేల పింఛన్లు తీసుకొనే వాళ్లకు కారు తప్ప మరొకటి కనిపించదని జాగ్రత్తగా చూసి ఓటువేయాలని హరీశ్ రావు కోరారు.
రాజేందర్ గారు కూడా భాజపాలో ఉండేటట్లు అనిపించడం లేదు. ఆయన ఎక్కడ భారత్ మాతా కీ జై అంటలేడు, జైశ్రీరాం అంటలేడు, జై మోదీ కూడా అంటలేడు. ఆయన కథనే చెప్పుకుంటున్నడు. ఆయన అవసరం కోసం భాజపాలో చేరిండు తప్ప, మనస్సుతో చేరలేదని జనమే చెప్తున్నరు. భాజపా కార్యకర్తలే చెప్తున్నరు. దీనిని బట్టి ఏందంటే మనం అనవసరంగా నష్టపోకూడదు. ఆయన అంటించుకున్న బురద మనందరికీ అంటించే ప్రయత్నం చేస్తుండు. ఆయన బాధను మనందరి బాధగా తీర్చే ప్రయత్నం చేస్తుండు. కానీ మనందరి బాధలనును తీర్చే నాయకుడు సీఎం కేసీఆర్. -హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి
ఇదీ చదవండి: TRS Leader Vinod Kumar : కేంద్రం ఇచ్చిన నిధులెన్నో చెప్పండి.. ఆలోచించి ఓటెయ్యండి