పట్టణాల ఆధునీకీరణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని బీసీ సంక్షేమశాఖమంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాష్ట్రంలోనే అత్యంత సుందరమైన నగరంగా కరీంనగర్‌ను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ప్రధాన జంక్షన్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. . మేయర్ సునీల్ రావు, కమిషనర్ క్రాంతితో కలిసి ప్రధాన కూడళ్ల నమూనాలను ఆయన పరిశీలించారు.
నగరంలోని నాలుగు కూడళ్లకు రూ.50 లక్షలు కేటాయించామని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే నగరంలో ప్రధాన రహదారుల నిర్మాణం పూర్తి కావస్తోందని తెలిపారు. నగరంలో ఎక్కడా మట్టి రోడ్లు లేకుండా తీర్చిదిద్దుతామమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరీంనగర్ అంటేనే ప్రత్యేక అభిమానమని అన్నారు. అభివృద్ది కోసం ఎన్ని నిధులైనా కేటాయిస్తారని గంగుల ధీమా వ్యక్తం చేశారు. దీనికి తోడుగా తెలంగాణ చౌక్ ఎదురుగా మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఈనెల 28న శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ వివరించారు..
పట్టణాలను చాలా అభివృద్ధి చేసుకుంటున్నాం. సీఎం కేసీఆర్ అదే లక్ష్యంతో పని చేస్తున్నారు. పట్టణాల ఆధునికీకరణ చేస్తాం. కరీంనగర్‌లోని అన్ని జంక్షన్లను సుందరంగా తీర్చిద్దుతున్నాం. ఇంకా కొన్ని చోట్ల అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. అవీ కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. తెలుగుతల్లి చౌరస్తాలో మాత్రమే పెండింగ్‌లో ఉంది. అదేవిధంగా తెలంగాణ చౌక్ ఎదురుగా మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం.- గంగుల కమలాకర్ మంత్రి
ఇదీ చూడండి: Minister Gangula: సీఎం.. కరీంనగర్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు