పారిశుద్ధ్య కార్మికుల శ్రమతోనే స్వచ్ఛ భారత్‌లో రాష్ట్రానికి మొదటి ర్యాంకుతో పాటు కరీంనగర్‌కు అవార్డులు వచ్చాయని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. కరోనా సమయంలోనూ వెనుకడుగేయకుండా సేవలందించిన కార్మికులను ముఖ్యమంత్రి కేసీఆర్ గుండెల్లో పెట్టుకున్నారని పేర్కొన్నారు. కార్మికుల సేవలను గుర్తించి రెండునెలల పాటు రూ.5వేల చొప్పున ప్రోత్సాహకం అందించారని అన్నారు. గాంధీజయంతిని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలో మేయర్ సునీల్‌రావుతో కలిసి నగరపాలక పారిశుద్ధ్య సిబ్బందిని సన్మానించారు.
గుండెల్లో పెట్టుకున్నాం...
పారిశుద్ధ్య కార్మికులు సక్రమంగా విధులు నిర్వర్తిస్తేనే నగరానికి మంచి పేరు, గుర్తింపు వస్తుందని మేయర్ సునీల్ రావు పేర్కొన్నారు. కార్మికులను నగరపాలక వర్గం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటోందని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి... వారికి గుర్తింపు పత్రాలను అందజేశారు.
ఇదీ చదవండి: కేంద్రం నిర్లిప్తత వల్లే తెలంగాణకు అన్యాయం: సీఎం కేసీఆర్