ఆర్థిక భారమైనప్పటికీ పేద ప్రజలు కడుపు నింపేందుకు ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేపట్టిందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా చెర్ల బుత్కూరులో ఉచిత బియ్యం పంపిణీని మంత్రి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 5కిలోలు మాత్రమే ఇవ్వడానికి నిర్ణయించిందని... దాంతో కొంత మందికే లబ్ధి చేకూరుతుందని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఉదార స్వభావంతో పేదలందరికీ... నవంబర్ వరకు బియ్యం అందించేందుకు నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ప్రజలు నిబంధనలు పాటిస్తూ... కరోనా నివారణలో ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: 'సీఎం ఫౌం హాస్ క్వారంటైన్లో ఉంటే.. కరోనా సమస్య పరిష్కారం కాదు'