హుజూరాబాద్‌లోని బోర్నపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డును బీసీ సంక్షేమ శాఖమంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. నియోజకవర్గంలో దాదాపు 350 రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. గత పదహారేళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ రోడ్లను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు.
ఆయన రాజీనామా తర్వాత నియోజకవర్గంలో అభివృద్ది పనులను పరిశీలిస్తే చాలా బాధ వేసిందని మంత్రి పేర్కొన్నారు. స్వార్థం కోసం కాకుండా ప్రజల గురించి ఆలోచించే వారినే ఎన్నుకోవాలని అన్నారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తే మరింత అభివృద్ది జరుగుతుందని గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు.
ఈరోజు మా ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో ఇక్కడే కనబడుతోంది. హుజూరాబాద్‌ను ఈటల రాజేందర్ ఏనాడూ పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్‌ను కలిసి వెంటనే రోడ్ల మరమ్మతును చేపట్టాం. నియోజకవర్గంలోని అన్ని రోడ్లను అభివృద్ధి చేస్తాం. ఈటల మాత్రం అభివృద్ధిని పక్కన పెట్టి భాజపాలో చేరిండు. ప్రజలు ఈ విషయం గమనించాలి. పని చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి.- గంగుల కమలాకర్, రాష్ట్రమంత్రి
ఇదీ చూడండి: Huzurabad by poll: 'ఆకలి తీర్చని కానుకలు మనకెందుకు.. అలాంటివి ఇచ్చినా తీసుకోకండి'