ఏ ఎన్నికలు వచ్చినా గెలిచేది తెరాసనేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో రెండో స్థానం కోసం కాంగ్రెస్, భాజపాలు పోటీ పడాల్సిందే తప్ప గెలిచే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధపార్టీల నుంచి కార్యకర్తలు, నాయకులు తెరాసలో చేరుతున్నారని ఆయన చెప్పారు. ఈ సందర్బంగా పార్టీలో చేరుతున్న వారిని పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అభివృద్ధిని కాంక్షించే పార్టీ తెరాస అయితే... అభివృద్ధిని అడ్డుకొనేది భాజపా అని ఆయన ఆరోపించారు. కరీంనగర్ నగరంలో స్మార్ట్‌సిటీ పనులు జరగకుండా అడుగడుగునా కమలం పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల్లో తెరాసను గెలిపించాలని, అభివృద్ధిని అడ్డుకొనే పార్టీలను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించవద్దని గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: పెరిగిన కాళేశ్వరం ఆరో ప్యాకేజీ పనుల అంచనా వ్యయం