ETV Bharat / state

మరోసారి పరస్పర విమర్శలకు దిగిన ఈటల, గంగుల - gangula latest news

మాజీ మంత్రి ఈటల, మంత్రి గంగుల మరోసారి పరస్పర విమర్శలకు దిగారు. ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. బ్లాక్​మెయిల్​ రాజకీయాలు మానుకోవాలని పరోక్షంగా గంగులను ఈటల హెచ్చరించగా.. ఈటల బెదిరింపులకు భయపడే వారెవరూ లేరంటూ గంగుల దీటుగా సమాధానం ఇచ్చారు.

మరోసారి పరస్పర విమర్శలకు దిగిన ఈటల, గంగుల

author img

By

Published : May 18, 2021, 2:32 PM IST

ఈటల గంగుల పరస్పర విమర్శలు

మాజీ మంత్రి ఈటల రాజేందర్​, మంత్రి గంగుల కమలాకర్​ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ.. మాటల తూటాలు పేల్చుతున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ క్రమంలోనే బ్లాక్​మెయిల్​ రాజకీయాలు మానుకోవాలని పరోక్షంగా గంగులను ఈటల హెచ్చరించారు. అధికారం శాశ్వతమనే భ్రమలో ఉన్నవాళ్లు.. 2023 తర్వాత అధికారంలో ఉండరని ఆక్షేపించారు. సాగర్​లో లాగా హుజూరాబాద్​లో గెలవాలని చూస్తే ప్రజలు పాతేస్తారని.. ఒకవేళ ఎన్నికలు వస్తే ప్రజలంతా తనకు అండగా ఉంటారని స్పష్టం చేశారు.

దీనికి మంత్రి గంగుల దీటుగా స్పందించారు. ఈటల బెదిరింపులకు ఎవరూ భయపడరంటూ ధ్వజమెత్తారు. రాజేందర్​ కళ్లల్లో భయం కనబడుతుందంటూ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని ఈటలకు సవాల్​ విసిరారు.

ఇదీ చూడండి: నేతల పరస్పర విమర్శలు.. బయటపడుతున్న తెరాస రహస్యాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.