ETV Bharat / state

చాడ పుస్తకం రాశారు... ఈటల ఆవిష్కరించారు...

author img

By

Published : Oct 22, 2020, 8:30 PM IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి రాసిన పుస్తకంతో పాటు ఓ పాటల సీడీని మంత్రి ఈటల రాజేందర్​ ఆవిష్కరించారు. గ్రామీణ జీవితాల్లో వచ్చిన మార్పును పుస్తకంలో చాడ చక్కగా వివరించారని మంత్రి ఈటల ప్రశంసించారు.

Minister eetela rajendar  unveiled the book written by Chada Venkat Reddy in karimnagar district
చాడ వెంకట్​రెడ్డి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి ఈటల

కమ్యూనిజం కనుమరుగవుతుంటే అన్యాయం,అవమానానికి వ్యతిరేకంగా పోరాడే వారు లేకుండా పోతున్నారనే ఆవేదన కలుగుతుందని వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్‌ జిల్లా రేకొండలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి రాసిన పుస్తకంతో పాటు పాటల సీడీని కలెక్టర్‌ శశాంకతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. గత అయిదు దశాబ్దాలుగా గ్రామీణ జీవితాల్లో వచ్చిన మార్పును పుస్తకంలో చక్కగా వివరించారని అన్నారు. ఇలాంటి పుస్తకాల వల్ల సమాజంలో వస్తున్న మార్పును తరతరాలకు అందించే వీలు కలుగుతుందని వెల్లడించారు.

పార్టీలు వేరైనా తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం పట్ల గొంతెత్తడానికి చాడ వెంకట్‌రెడ్డి నిరంతరం సిద్దంగా ఉండేవారని పేర్కొన్నారు. 'రేకొండ సామాజిక ఛైతన్యం-గ్రామీణ స్థితిగతులు' పేరుతో రాసిన ఈ పుస్తకంలో రాసింది... తమ గ్రామం గురించి అయినా తెలంగాణ ప్రజల జీవితాన్ని అద్దం పట్టేలా ఉంటుందని చాడ అన్నారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన గ్రామం పేరుతో పుస్తకం రాయడం ఎంతో సంతోషంగా ఉందని చాడ వెంకట్‌‌రెడ్డి పేర్కొన్నారు.

ఇవీ చూడండి: వరద నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రంలో కేంద్రబృందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.