శ్రీ భాష్యం విజయసారథికి పద్మశ్రీ అవార్డు రావడంతో కరీంనగర్ జిల్లా పులకించిందని.. ఈ గడ్డ బిడ్డకు దక్కిన గొప్ప గౌరవమని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన శ్రీ భాష్యం విజయసారథికి కలెక్టరేట్‌లో ఆయనకు ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. శ్రీ భాష్యం విజయసారథి సంస్కృతం గొప్పదనాన్ని దేశం నలుమూలలో చాటారన్నారు. విజయసారథిని గౌరవించడమంటే న్యాయాన్ని, ధర్మాన్ని, జ్ఞానాన్ని సన్మానించడమేనని కొనియాడారు.
సమాజంలో ధర్మం, న్యాయం, మానవ సంబంధాలు మత్రమే శాశ్వతమని ఆయన పేర్కొన్నారు. విజయసారథి కవితలు చదవాలని, మహాకవి కాళోజీకి ఉన్న లక్షణాలు విజయసారథికి ఉన్నాయని ప్రశంసించారు.
ఇదీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ