వచ్చే నెల నుంచే రూ. 2000 పింఛన్ : ఈటల కరీంనగర్ జిల్లా సైదాపూర్, వెన్కపల్లి గ్రామాల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ రోడ్డు షోలో పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి ర్యాలీ తీశారు. వచ్చే నెల నుంచి రూ.2000 పింఛన్ అందిస్తామని మంత్రి తెలిపారు. వర్షాకాలం నాటికి కాళేశ్వరం నీళ్లు తీసుకొస్తామన్నారు. ప్రతి ఇంటింటికి మూడు నెలల్లో తాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే సతీశ్ ఇతర తెరాస నాయకులు పాల్గొన్నారు.ఇవీ చూడండి:'నిధులు తెచ్చే దమ్ము తెరాస ఎంపీలకే ఉంది'