లోకంలో ప్రతి ఒక్కరికీ కన్నతల్లే మొదటి గురువు, దైవం. ఈ విషయాన్ని అందరికీ తెలియజేసేందుకే... మాతృదేవో భవ... పితృ దేవో భవ... ఆచార్య దేవో భవ... అన్నారు పెద్దలు. ఇలాంటి విషయాలను మర్చిపోతున్న నేటి సమాజానికి కనువిప్పు కలిగేలా కరీంనగర్లో మాతృమూర్తులకు పాదపూజ కార్యక్రమం నిర్వహించారు.
చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో కరీంనగర్లో వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. 14 రోజుల ఈ శిక్షణలో భాగంగా ఈరోజు మాతృమూర్తులకు చిన్నారులు పాదపూజ చేశారు. చిన్నప్పటినుంచే పిల్లలకు సంప్రదాయాలను అలవాటు చేస్తే క్రమశిక్షణతో మెలుగుతారని చిన్మయ మిషన్ నిర్వాహకులు పేర్కొన్నారు.
తమ బిడ్డలు తల్లి మీద ప్రేమ, గౌరవం, భక్తితో పూజ చేయడం చాలా సంతోషాన్నిస్తుందని చిన్నారుల తల్లులు తెలిపారు.
ఇవీ చూడండి: అలా వచ్చాడు... ఇలా కొట్టేశాడు...