ETV Bharat / state

Masti Goli Soda in Karimnagar : సాఫ్ట్‌వేర్​ జాబ్​ విడిచి.. గోలీ సోడాతో హిట్​ కొట్టాడు - problems in goli soda bussiness

Masti Goli Soda in Karimnagar : ఏసీ గదుల్లో ఉద్యోగం అతడికి హాయినివ్వలేదు. రిస్క్‌ చేయకుంటే లైఫ్‌లో దొరికేది రస్క్ మాత్రమే అనుకున్నాడు. 30 ఏళ్ల వయసులో రిస్క్‌ చేయకుంటే.. ఇంకెప్పటికీ చేయలేమని అంటున్నాడు ఆ యువకుడు. మంచి జీతం, సాఫ్ట్‌వేర్‌ కొలువు ఇవన్నీ వదిలి.. సొంత వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారం అంటే ఏదో కాదండోయ్.. చిన్నప్పుడు మనందరం రుచి చూసిన గోలీ సోడానే అతడి వ్యాపారం. మరి అదెలా సాగుతోందో తెలుసుకుందామా..?

Masti cool Drink owner story
Masti cool Drink owner story
author img

By

Published : May 30, 2023, 7:38 PM IST

గోలీసోడా వ్యాపారం విజయవంతంగా నడుపుతున్న రఘునాధ్

Masti Goli Soda in Karimnagar : నెలవారీ జీతం వస్తుంది కదా అని చేతులు ముడుచుకు కూర్చుంటే.. మరో పది మందికి ఉపాధి ఎలా కల్పించగలమంటున్నాడు కరీంనగర్​కు చెందిన తుల రఘునాథ్. సాఫ్ట్‌వేర్ రంగంలో మంచి ఉద్యోగం ఉన్నా.. కోయంబత్తూర్‌లో చూసిన గోలీ సోడా ఇక్కడ ఎందుకు పెట్టకూడదనే ఆలోచనతో వ్యాపారం ప్రారంభించాడు. తన ఆలోచన చెప్పినప్పుడు కొందరు వద్దని వాదిస్తే, ఇంకొందరు ఎగతాళి చేశారు. కానీ తను మాత్రం పట్టు విడవలేదు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌గా స్థిరపడ్డాడు. కానీ, మనసు వ్యాపారంవైపు లాగడంతో గోలీసోడా తయారీ వైపు పరుగులు తీశాడు. పెట్టుబడి లేకుంటే ఇంటిని తాకట్టు పెట్టి డబ్బులు సమకూర్చుకున్నాడు. కాలానికి అనుగుణంగా కొత్త రుచులను ఆస్వాదిస్తున్న ప్రజలను మళ్లీ బాల్యంలోని జ్ఞాపకాల వైపు తీసుకెళ్లారు.

Masti Goli Soda : మస్తీ సోడా కంపెనీ ప్రారంభించాడు. కొత్త కార్పొరేట్‌ రుచులకు అలవాటైన జనాన్ని తనవైపు తిప్పుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. కాలానికి అనుగుణంగా కొత్త రుచులు ఆస్వాదిస్తున్న జనాలకు ఆధునికత జోడించి తమ బాల్యాలకు తీసుకెళ్లాడు. ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గట్టు తయారీకి సంబంధించిన సమాచారంతో పాటు అందులో వాడే పదార్థాల వివరాలను తెలిపాడు. తన సంస్థలో వర్కర్స్‌ చాలా బాగా పని చేస్తున్నారని చెబుతున్నాడు రఘునాథ్‌. ప్రస్తుతం మల్టీనేషన్‌ కంపెనీల కూల్‌డ్రింక్స్‌తో తమ గోలీసోడా పోటీపడటం ఆనందంగా ఉందంటున్నారు. తాను ఒకరి కింద ఉద్యోగం చేసే కన్నా.. మరో వంద మందికి ఉపాధి కల్పిస్తున్నానని కొంత గర్వంగా ఉందని చెబుతున్నారు. 3 పదుల వయస్సులో రిస్క్‌ తీసుకోకపోతే ఇంకెప్పుడు తీసుకుంటామన్న ఆలోచన ముందుకు నడిపించిందని చెబుతున్నారు. తమకు తమిళనాడులోనూ బ్రాంచీ ఉందని తెలిపాడు.

"ఈ వ్యాపారంలోకి రాకముందు నేను సాఫ్ట్​వేర్​ కంపెనీల్లో పని చేశాను. అందులో భాగంగానే కోయంబత్తూర్​ వెళ్లినప్పుడు ఈ గోలీ సోడా వ్యాపారాన్ని చూశాను. దాంతో వివరాలు అన్నీ తెలుసుకుని ఇలాంటిదే నేనే పెట్టవచ్చు కదా అని అనుకున్నాను. 2020లో ఈ ఐడియా వచ్చింది. కొవిడ్​ వల్ల కాస్త నెమ్మదిగా నడిచింది. ప్రస్తుతం మా గోలీ సోడా గురించి చాలా మందికి తెలిసింది. బ్రాంచ్​లు కూడా పెట్టాను. సీసాతో పాటు ప్లాస్టిక్​ బాటిల్​లోనూ మా ప్రోడక్ట్​ సరఫరా చేస్తున్నాం."- తుల రఘునాథ్, మస్తీ గోలీసోడా వ్యవస్థాపకుడు

100 మందికి ఉపాధి కల్పిస్తున్న 'గోలీ సోడా': రాష్ట్రంలో 3 జిల్లాల్లో బ్రాంచ్​లు ఉన్నాయని రఘునాథ్​ తెలిపాడు. సీసా కారణంగా రవాణా ఇబ్బందిగా ఉండటం వల్ల ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నట్లు వివరించాడు. తను పెట్టిన సంస్థ ద్వారా దాదాపు 80 నుంచి 100 మందికి జీవనోపాధి కల్పిస్తున్నాడు. చదువు కొనసాగిస్తూ పని చేసుకునే వారూ ఇందులో ఉన్నారు. మస్తీ గోలీ సోడాలో పని చేసే వారిలో ఎక్కువ మంది మహిళలే ఉండడం గమనార్హం. తొలుత గోలిసోడా కంపెనీని ప్రారంభించడానికి భయపడ్డానని.. క్రమంగా వ్యాపారం వృద్ధి చెందడంతో భరోసా వచ్చిందని తెలిపాడు. రిస్క్‌ తీసుకోవాలి కానీ, సరైన ప్రణాళిక ఉండాలంటున్నాడు. తమ సంస్థను విస్తరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పాడు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.