కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని రైసు మిల్లుల్లో పనిచేసే కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. సమస్యల పరిష్కారానికి పది రోజులుగా సమ్మె చేస్తున్నా.. అటు యాజమాన్యాలు.. ఇటు అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు పెంచాలని అడిగితే.. నిర్లక్ష్యం వహిస్తున్నారని, పలు దఫాలుగా సమావేశాలు ఏర్పాటు చేసినా.. అధికారులు సైతం.. యాజమాన్యానికే వత్తాసు పలుకుతున్నారని అన్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని.. అధికారులు, యాజమాన్యం స్పందించాలని కోరారు.
ఇవీ చూడండి: హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్