ETV Bharat / entertainment

'హ్యారీపోటర్‌'లా ప్రభాస్‌ సినిమా - ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత - PRABHAS RAJASAAB MOVIE

ప్రభాస్ కొత్త సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన స్టార్ ప్రొడ్యూసర్!

Prabhas Rajasaab Movie Update
Prabhas Rajasaab Movie Update (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 12, 2024, 10:17 PM IST

Prabhas Rajasaab Movie Update : పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్‌ నటిస్తున్న కొత్త సినిమాలపై నిర్మాత భూషణ్‌ కుమార్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్​ చేశారు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 'ది రాజాసాబ్‌' గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. "ఆ చిత్రంలోని విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయి. నేను కొన్ని సన్నివేశాలను చూశాను. అవి హాలీవుడ్‌ చిత్రం హ్యారీపోటర్‌ను తలపించేలా ఉన్నాయి" అని పేర్కొన్నారు.

'స్పిరిట్‌'(Prabhas Spirit Movie) గురించి మాట్లాడుతూ - "వచ్చే ఏడాది ప్రారంభంలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. డిసెంబరులో అఫీషియల్​గా లాంఛనంగా షురూ చేస్తాం. ఇది చాలా పెద్ద మూవీ. పోలీస్​ బ్యాక్ డ్రాప్​ నేపథ్యంతో భిన్న జానర్‌లో తెరకెక్కుతుంది. స్టార్ యాక్టర్స్​ ఈ చిత్రంలో భాగం కానున్నారు. వారి వివరాలు త్వరలోనే చెబుతాం. ఈ మూవీ కోసం ప్రభాస్‌ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు" అని అన్నారు. కాగా, అంతకుముందు ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌ నిర్మాతల్లో భూషణ్‌ కుమార్‌ కూడా ఒకరు. స్పిరిట్‌ చిత్రానికి కూడా ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

రాజాసాబ్ సినిమా విషయానికొస్తే హారర్‌ కామెడీ బ్యాక్​డ్రాప్​తో దర్శకుడు మారుతి దీనిని తెరకెక్కిస్తున్నారు. మాళవికా మోహనన్‌, రిద్ధి కుమార్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాలో ప్రభాస్‌ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. రీసెంట్​గా విడుదలైన గ్లింప్స్​, ఫస్ట్ లుక్ పోస్టర్​ ఫ్యాన్స్​ విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్​తో దీనిని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై టీజీ విశ్వప్రసాద్ తెరెకక్కిిస్తున్నారు.

అలానే సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించనున్న చిత్రమే స్పిరిట్‌. ఇందులోనే ప్రభాస్‌ పవర్​ఫుల్​ పోలీస్ ఆఫీసర్​గా నటించనున్నారు. ఆయన పాత్ర రెండు కోణాల్లో సాగే అవకాశమున్నట్లు ప్రచారం సాగుతోంది. 2026లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం డిసెంబరు నెలాఖరు నుంచి చిత్రీకరణ ప్రారంభించుకోనుంది.

Prabhas Upcoming Movies : హీరో ప్రభాస్‌ ఏకకాలంలో ఒకటికి రెండు సినిమాలతో సెట్స్‌పై తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రాజాసాబ్‌, హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ సినిమా చిత్రీకరణ దశలో ఉన్నాయి. అలాగే సలార్‌ 2 షూటింగ్‌ కూడా మొదలైనట్లు ఇటీవలే చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్​ వెల్లడించింది.

ప్రభాస్​ 'స్పిరిట్​'​ అప్డేట్​ - దూసుకెళ్లేందుకు సిద్ధంగా!

పవర్​ఫుల్​ పోస్టర్​తో బాలయ్య NBK 109 సర్​ప్రైజ్​ - టైటిల్​ టీజర్​ అప్డేట్​ వచ్చేసిందోచ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.