ETV Bharat / state

పటిష్ఠంగా లాక్​డౌన్​.. బయటకు వస్తే వాహనాలు సీజ్​

author img

By

Published : May 26, 2021, 2:09 PM IST

కరీంనగర్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో లాక్​డౌన్​ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం పది గంటల తర్వాత బయటకు వచ్చినవారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. వాహనాలను సీజ్​ చేస్తున్నారు.

lockdown in karimnagar police commissionerate
కరీంనగర్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో లాక్​డౌన్​

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సీపీ వీబీ కమలాసన్ రెడ్డి కఠిన చర్యలు చేపడుతున్నారు. కొవిడ్​ 19 నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు ఇవ్వగా నగరంలోని ప్రజలు పెద్ద ఎత్తున మార్కెట్​కు తరలి వస్తున్నారు. దీంతో వైరస్ తిరిగి విజృంభించే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనులు ఉన్నా లేకున్నా ప్రజలు పెద్ద మొత్తంలో బయటకు రావడంపై సీపీ కఠిన ఆంక్షలు విధిస్తున్నారు.

లాక్​డౌన్​ సమయంలో నగరంలోని కాలనీల్లో సీపీ పర్యటిస్తూ అనవసరంగా బయటకు వచ్చిన వారి వాహనాలను సిబ్బంది సహాయంతో స్టేషన్​కు తరలించారు. ఒకప్పుడు సీఐ, సిబ్బంది మాత్రమే గల్లీల్లో తిరుగుతుండేవారు. కానీ ఇప్పుడు సీపీ కమలాసన్ రెడ్డి సైతం రంగంలోకి దిగారు.

ఇదీ చదవండి: వైద్య సిబ్బంది డిమాండ్లను నెరవేర్చాలి: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.