ETV Bharat / entertainment

'ఆయుధ పూజ' సాంగ్ రిలీజ్ - తారక్ ఫ్యాన్స్ హ్యాపీ​! - Devara Songs - DEVARA SONGS

Devara Ayudha Pooja Song : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌ - కొరటాల శివ కాంబో తెరకెక్కిన సినిమా 'దేవర'. ఈ సినిమా నుంచి మేకర్స్ 'ఆయుధ పూజ' పాట విడుదల చేశారు.

Devara Ayudha Pooja
Devara Ayudha Pooja (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2024, 8:42 PM IST

Devara Ayudha Pooja Song : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌ - కొరటాల శివ కాంబో తెరకెక్కిన 'దేవర' మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న 'ఆయుధ పూజ' పాటను మేకర్స్ గురువారం రిలీజ్ చేశారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, సింగర్ కాలభైరవ పాడారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. మరి మీరు పాట విన్నారా?

ఇక తాజాగా సినిమా నుంచి అన్ని పాటలతో జ్యూక్​ బాక్స్ (Juke Box) కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. దేవరలోని అన్ని పాటలు ఈ జ్యూక్ బాక్స్​లో అందుబాటులో ఉంటాయి. ఇక ఇప్పటికే రిలీజైన ఫియర్, చుట్టమల్లే, దావూదీ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా చుట్టమల్లే పాట 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి అరుదైన ఘతన సాధించింది. ఈ పాటకు సోషల్ మీడియాలో నెటిజన్లు లక్షల్లో రీల్స్ చేశారు.

కాగా, ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రెండు భాగాలుగా తెరకెక్కించారు. సముద్రం బ్యాక్​డ్రాప్​లో హై క్వాలిటీ వీఎఫ్​ఎక్స్​తో ఈ సినిమా తెరకెక్కింది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్​గా నటించింది. సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్​ పాత్ర పోషించారు. శ్రీకాంత్, రమ్యకృష్ణ, ప్రకాశ్ ​రాజ్, శ్రతి మరాఠే, గెటప్ శ్రీను తదితరులు ఆయా కీలక పాత్రలు పోషించారు.

భారీ అంచనాల నడుమ విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులు నెలకొల్పింది. ఓవర్సీస్‌లో ప్రీసేల్‌ బుకింగ్స్‌లో అత్యంత వేగంగా వన్‌ మిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరుకుంది. లాస్‌ ఏంజెల్స్‌లో జరగనున్న బియాండ్‌ ఫెస్ట్‌లో ప్రదర్శితం కానున్న తొలి భారతీయ సినిమా ఇదే. వరల్డ్​వైడ్​ గ్రాండ్​గా శుక్రవారం (సెప్టెంబర్ 27) రిలీజ్ కానుంది. హెదరాబాద్​లో పలు థియేటర్లలో అర్థరాత్రి 1.00 గంటలకే తొలి షో పడనుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఇప్పటికే థియేటర్లకు చేరుకొని సందడి చేస్తున్నారు. ఫ్యాన్స్ తాకిడితో థియేటర్లు కోలాహలంగా మారాయి.

మీరు 'దేవర'కు వెళ్తున్నారా? - ఈ 15 ఆసక్తికర విషయాలు తెలుసా? - Devara Movie Interesting Facts

హాలీవుడ్​లో 'దేవర' స్క్రీనింగ్ - USలోనూ సినిమాకు ఫుల్ క్రేజ్! - Devara Screening At Los Angeles

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.