కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్కు కరీంనగర్ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ప్రధాన రహదారున్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. నిత్యావసరాలైన మందులు, కూరగాయలు, బియ్యం, పప్పులు వంటి వాటిని కొనేందుకు ప్రజలు బయటకు వచ్చినప్పటికీ దుకాణాల వద్ద కరోనా వ్యాప్తి చెందకుండా పూర్తిస్థాయిలో నియమాలను పాటిస్తున్నారు. షాపింగ్ మాల్స్ ముందు బారులు తీరిన ప్రజలు సామాజిక దూరం పాటిస్తున్నారు.
పారిశుద్ధ్యంపై నగరంలో ఎప్పటికప్పుడు నగరపాలక సంస్థ మేయర్ సునీల్ రావు సమీక్షించి చర్యలు చేపడుతున్నారు. ద్విచక్ర వాహనాలపై ఒక్కరికి మించి వెళ్లకుండా పోలీసులు నిలువరిస్తున్నారు.
ఇవీచూడండి: 'ఆ పన్నెండు సూత్రాలు పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యం'