ETV Bharat / state

huzurabad liquor sales: హుజూరాబాద్​లో మద్యం అమ్మకాల జోరు.. కోట్లలోనే..! - తెలంగాణ వార్తలు

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. మరోవైపు మద్యం అమ్మకాలు(huzurabad liquor sales) జోరందుకున్నాయి. ఇప్పటికే రికార్డుస్థాయిలో మద్యం అమ్ముడుపోతోంది. పక్క జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈటల రాజేందర్ రాజీనామాతో ఐదు మాసాలుగా హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లో రూ.వందల కోట్లలో లిక్కర్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. అసలే దసరా సీజన్.. ఆపై ఎన్నికల ప్రభావం.. మరో నెలపాటు కిక్కే కిక్కు ఉంటుందని అంచనాలున్నాయి.

huzurabad liquor sales, liquor sales in huzurabad
హుజూరాబాద్​లో మద్యం అమ్మకాల జోరు, హుజూరాబాద్‌లో మద్యం జోరు
author img

By

Published : Sep 29, 2021, 1:21 PM IST

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా మొదలు ఇప్పటిదాకా మద్యం అమ్మకాలు(huzurabad liquor sales) గణనీయంగా పెరిగాయి. హుజూరాబాద్, జమ్మికుంట ఎక్సైజ్‌ సర్కిల్‌లో మొత్తం 29 దుకాణాలున్నాయి. గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు రూ.125కోట్ల మద్యం అమ్ముడుపోగా.. 2021లో రూ.170కోట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాదికన్నా సుమారు రూ.45 కోట్ల వ్యాపారం అధికంగా జరిగింది. అసలే దసరా సీజన్.. ఆపై ఎన్నికల ప్రభావం.. మరో నెలపాటు కిక్కే కిక్కు ఉంటుందని అంచనాలున్నాయి.

గతేడాది ఇలా..

గతేడాది ఆగస్టు వరకు రూ.3.60 లక్షల బీర్లు, లిక్కర్లు అమ్ముడవగా, ప్రస్తుతం లిక్కరు, బీర్లు కలిపి 3,92,616 కేసుల మద్యం అమ్ముడైంది. ముఖ్యంగా గత మూడు నెలల నుంచే రెట్టింపు మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. జిల్లామొత్తం రూ.320 కోట్ల వ్యాపారం జరగ్గా.. 55శాతం అమ్మకాలు ఇక్కడే జరగడం విశేషం. నోటిఫికేషన్‌తో అమ్మకాల జోరు మరింత పెరగనుంది.

పక్క జిల్లాల నుంచి..

హుజూరాబాద్‌ నియోజకవర్గానికి కేవలం కరీంనగర్‌ జిల్లాకు చెందిన మద్యమే కాకుండా, వివిధ జిల్లాల నుంచి కూడా దిగుమతి అవుతోందని తెలుస్తోంది. ఉప ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే పెద్దఎత్తున మద్యం(huzurabad liquor sales) నిల్వలు హుజూరాబాద్‌కు చేరుకున్నాయని సమాచారం. ఎన్నికల నేపథ్యంలో ఆబ్కారీశాఖకు కూడా భారీగానే ఆదాయం పెరగనుంది.

ఉపఎన్నిక ఎందుకు?

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తెరాసకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా హుజురాబాద్‌ ఉపఎన్నిక(huzurabad by election 2021) వచ్చింది. భూకబ్జా ఆరోపణలు.. పార్టీలో పొమ్మన లేక పొగపెట్టడం వల్ల తెరాస నుంచి బయటకు వచ్చానని ఈటల ప్రకటించారు. భాజపాలో చేరి తెరాసకు సవాల్‌ విసిరారు. హుజురాబాద్‌(huzurabad by election 2021)లో విజయంపై ధీమాగా ఉన్న ఈటల.. నియోజకవర్గమంతా కలియ తిరుగుతున్నారు. ఇప్పటికే పాదయాత్రతో పాటు ప్రజల దీవెనలు పొందేందుకు విస్తృతంగా పర్యటిస్తున్నారు. తెరాసలో తనకు జరిగిన అన్యాయం, తెలంగాణ ఉద్యమకాలంలో తాను చేసిన పోరాటాన్ని వివరిస్తున్నారు. అధికార పార్టీలో తనను ఎలా ఇబ్బంది పెట్టారనే అంశాలను నియోజకవర్గ ప్రజలకు విన్నవిస్తున్నారు. ఈటల రాజేందర్‌ విజయాన్ని భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఈటల గెలుపు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మలుపు కాగలదని అంచనా వేస్తోంది.

అస్త్రశస్త్రాలతో తెరాస రెఢీ..

ఈటలను ఢీ కొట్టేందుకు తెరాస అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది. మంత్రి హరీశ్‌రావు హుజూరాబాద్(huzurabad by election 2021) బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. కొన్ని నెలలుగా నియోజకవర్గంలోనే ఉంటూ అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తెరాస అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ ఖరారవగా అతణ్ని ముందుకు నడిపిస్తూ హరీశ్‌రావు నియోజకవర్గ ప్రజలతో మమేకం అవుతున్నారు. గెల్లు శ్రీనివాస్‌ గెలిస్తే జరగబోయే అభివృద్ధిని వివరిస్తున్నారు. ఈటల రాజేందర్‌ తన స్వప్రయోజనాల కోసమే భాజపాలో చేరారని విమర్శిస్తున్నారు. కనీసం నియోజకవర్గంలో రెండు పడక గదుల ఇళ్లను కట్టించలేకపోయారని హరీశ్‌రావు మాటల దాడికి దిగుతున్నారు. ఏ అవకాశాన్నీ చేజార్చుకోరాదని .. ఈటల వంటి బలమైన నేతను ఓడిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి భాజపా ప్రభావం తగ్గించాలని గులాబీ దళం వ్యూహంగా ఉంది. అందులో భాగంగా ఎల్.రమణ, ఇ.పెద్దిరెడ్డి, కౌశిక్‌రెడ్డి తదితర నేతలను పార్టీలో చేర్చుకుంది. కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ నామినేటెడ్‌ పదవి కేటాయించగా గవర్నర్‌ వద్ద పరిశీలనలో ఉంది.
ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.