పలువురు తెరాస నాయకులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సమక్షంలో భాజపా తీర్థం పుచ్చుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలంలో మాజీ తెరాస మండల అధ్యక్షుడు ఏనుగుల కనకయ్య, మాజీ సర్పంచ్ రవీందర్తో పాటు పలువురు భాజపా కండువా కప్పుకున్నారు. కరీంనగర్లోని ఎంపీ నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది.
కొడిమ్యాల మండల కేంద్రంలో ప్రజలు తాగు, సాగు నీరు, యూరియా, కొండగట్టు బాధితుల కోసం మంత్రుల కాన్వాయ్ ముందు ఆందోళన చేపడితే అక్రమ కేసులు పెట్టడం అన్యాయమని ఎంపీ అన్నారు. వారిపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని సంజయ్ డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : రాష్ట్రాలపై కేంద్రం కర్రపెత్తనం చేస్తోంది: సీఎం కేసీఆర్