కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కుంకుమ పూజలు చేశారు. పుణ్య వచనం, రుత్విక్ దీక్ష వస్త్రాధారణ, రక్షాబంధనం, అంకురార్పణ, మృత్యం గ్రహణం, ధ్వజారోహణం చేశారు.
మధ్యాహ్నం రోటిగూడెం శ్రీహరి మౌనస్వామి ఆధ్వర్యంలో స్వామి కల్యాణ మహోత్సవం జరిపారు. పలు గ్రామాలు, మండలాల నుంచి వందల సంఖ్యలో భక్తులు హాజరై స్వామి కల్యాణోత్సవ వైభవాన్ని తిలకించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి : 'అలా చేస్తే సీఎం కేసీఆర్ ఇరుకున్నట్లే'