కరీంనగర్ జిల్లా వినాయకనగర్ 27వ డివిజన్లోని మహిళలు ఆందోళనకు దిగారు. తమ కార్పొరేటర్ తప్పిపోయారని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు ఓట్లు వేస్తే కాలనీలో రహదారులు కట్టిస్తామన్నారని.. ఇప్పుడు రోడ్డు నిర్మాణానికి పనులు ప్రారంభించి పూర్తి చేయలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ కోడూరి రవీందర్ గౌడ్ తప్పిపోయారని గోడలకు పోస్టర్లు అతికించారు.
ఇదీ చదవండిః సచివాలయం తరలింపునకు ప్రణాళిక సిద్ధం