ETV Bharat / state

జీవితం, జీవనోపాధి రెండూ ముఖ్యమే: మంత్రి కేటీఆర్​ - ktr on corona

కరోనా విజృంభిస్తున్న వేళ జీవితం, జీవనోపాధి రెండూ ముఖ్యమేనని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఎక్కువ కాలం లాక్‌డౌన్ విధిస్తే ప్రజలు ఉపాధి కోల్పోతారన్న మంత్రి... కరోనాతో సహజీవనం చేస్తూనే.. ఉపాధి, అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కరోనా బారిన పడకుండా ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. కరీంనగర్‌ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్‌... సంక్షోభాన్ని కూడా సదవకాశంగా మలుచుకోవాలని హెల్త్‌కేర్‌ నిపుణులకు సూచించారు.

ktr tour in karimnagar district for harithaharama and development activities
జీవితం, జీవనోపాధి రెండూ ముఖ్యమే: కేటీఆర్​
author img

By

Published : Jul 8, 2020, 7:49 PM IST

జీవితం, జీవనోపాధి రెండూ ముఖ్యమే: కేటీఆర్​

కరీంనగర్‌ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్‌.. నగరంలోని ప్రతిమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంచార వైద్యశాలను మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి ప్రారంభించారు. కరోనా పోరులో ఈ తరహా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ప్రతిమ ఫౌండేషన్‌ను ప్రశంసించారు. మహమ్మారితో కలిసి జీవిస్తూనే.... జీవనోపాధి కూడా మెరుగుపర్చుకోవాలని సూచించారు. కరోనా విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాన్న మంత్రి...జాగ్రత్తలు పాటించడంలో నిర్లక్ష్యం వహించడం వల్లే డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు కరోనా బారిన పడ్డారని గుర్తుచేశారు.

విపక్షాలు నిర్మాణాత్మక సలహాలతో ముందుకు రావాలి

కరోనా పోరులో ప్రభుత్వం విఫలమైందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధరహితమైనవంటూ మంత్రులు కేటీఆర్‌, ఈటల కొట్టిపారేశారు. దేశంతో పోలిస్తే రాష్ట్రంలో మరణాల రేటు చాలా తక్కువగా ఉందని గుర్తుచేశారు. సరైన సందర్భం కాదని కేంద్రంపై విమర్శించడం లేదన్న కేటీఆర్‌.. విపక్షాలు నిర్మాణాత్మక సలహాలతో ముందుకు రావాలి కానీ.. అసంబద్ధ విమర్శలు సరికాదని హితవు పలికారు.

సాంకేతిక రంగాలు కొత్త ఆవిష్కరణలవైపు సాగాలి

కరోనా సంక్షోభాన్ని..హెల్త్‌కేర్‌ రంగం అవకాశంగా మలుచుకోవాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. సాంకేతిక రంగాలు కొత్త ఆవిష్కరణలవైపు సాగాలని పిలుపునిచ్చారు. ఫార్మా రంగంలో హైదరాబాద్‌ ఇప్పటికే ఎంతో ముందుందని స్పష్టం చేశారు.అంతకుముందు చొప్పదండి మండలం వెదురుగట్టులో హరితహారం హరితహారంలో భాగంగా మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి కేటీఆర్​ మొక్కలు నాటారు. నీరు కొనే పరిస్థితి నుంచి... గాలి కొనే పరిస్థితికి చేరవద్దంటే మొక్కలు విరివిగా పెంచాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి : ప్యాలెస్‌ ఆఫ్‌ వర్సైల్స్‌ స్ఫూర్తిగా నూతన సచివాలయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.