ETV Bharat / state

పెళ్లికి వెళ్లిన సీఎం కేసీఆర్.. గిఫ్ట్‌గా ఛైర్మన్ పదవి - రవీందర్ కుమార్తె పెళ్లికి వెళ్లిన కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్... మాజీ మేయర్ రవీందర్ సింగ్‌ కుమార్తె వివాహానికి హాజరయ్యారు. అక్కడ నవ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం మంత్రి గంగుల ఇంటికి వెళ్లి తేనీటి విందు స్వీకరించి.. హైదరాబాద్‌కు వచ్చారు. అయితే రవీందర్‌కు సింగ్‌కు సీఎం ఓ గిఫ్ట్ ఇచ్చారు.

KCR attended the wedding
మాజీ మేయర్ కుమార్తె పెళ్లికి హాజరైన కేసీఆర్
author img

By

Published : Dec 8, 2022, 4:29 PM IST

Updated : Dec 8, 2022, 4:50 PM IST

కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు. నవ దంపతులను కేసీఆర్‌ ఆశీర్వదించారు. అంతక ముందు సీఎం కేసీఆర్‌కు హెలిప్యాడ్ వద్ద మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్ద భారీ భద్రత కల్పించినా... టీఆర్‌ఎస్‌ నాయకులు ముఖ్యమంత్రిని కలిసేందుకు ఎగబడ్డారు.

హెలికాప్టర్‌లో ఎర్రవల్లి నుంచి కరీంనగర్ చేరుకోగా... ప్రత్యేక వాహనంలో వివాహానికి హాజరయ్యారు. నవదంపతులను ఆశీర్వదించి.. వారితో కలిసి ఫొటోలు దిగారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి వెళ్లారు. అక్కడ కాసేపు సేదతీరి.. తేనీటి విందు స్వీకరించి.. సాయంత్రం హైదరాబాద్‌ వచ్చారు.

ఇదిలా ఉంటే... కరీంనగర్ మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్‌కు కేసీఆర్ గిఫ్ట్ ఇచ్చారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు.. సీఎం కేసీఆర్ పెళ్లికి వెళ్లి.. గిఫ్ట్‌గా ఛైర్మన్ పదవి ఇచ్చారని అనుకుంటున్నారు.

kcr-attended-the-wedding-of-former-mayor-ravinder-singh-daughter-in-karimnagar
రవీందర్‌సింగ్‌ను రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వ్యూలు

ఇవీ చూడండి:

Last Updated : Dec 8, 2022, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.