కరీంనగర్ రైతుబజార్ ప్రాంతంలో తెల్లవారుజామున 300 మంది పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 56 ద్విచక్రవాహనాలు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత గుట్కాను సీజ్ చేశారు. కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కమిషనర్ కమలాసన్ రెడ్డి సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు.
ఇవీ చూడండి:మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారిపై కేసులు