కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. నగరపాలక సంస్థలో ఇప్పటికే 20వ డివిజన్‌తో పాటు 37వ డివిజన్ ఏకగ్రీవం కాగా... మిగతా 58 డివిజన్లకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 369 మంది అభ్యర్థులు బరిలో ఉండగా... 58 డివిజన్లలో దాదాపు 2లక్షల 69 వేల మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల విధుల్లో 20 మంది రూట్ ఆఫీసర్లు, 20 నోడల్ ఆఫీసర్లు, 20 మంది సెక్టార్ ఆఫీసర్లలతో పాటు పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు, వెబ్ కాస్ట్ సిబ్బంది, 20 మంది ఆర్వోలు, మున్సిపల్ సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు.
అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్...
పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లను పురపాలక శాఖ డైరెక్టర్ శ్రీదేవితో పాటు కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి, కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి పరిశీలించారు. నగరంలోని పోలింగ్ బూత్‌లలో 82 సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు సీపీ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా వెబ్‌కాస్టింగ్ కూడా కల్పిస్తున్నారు. నగరంలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు చేస్తున్నట్లు సీపీ తెలిపారు.
ఇదీ చూడండి: దారుణం: తాతయ్య, నానమ్మే చంపేశారు