ETV Bharat / state

Karimnagar Talented Kid : బాలల్లో మేటి.. మన కరీంనగర్ బేటీ

Karimnagar Talented Kid : బుడి బుడి అడుగులతో తడబడే బుజ్జాయి.. అందరూ అవాక్కయ్యేలా చిరుప్రాయంలోనే రికార్డులు సాధిస్తోంది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు.. పిన్నవయస్సులోనే చిచ్చరపిడుగులా అనేక ఘనతలు సాధించి నివ్వెర పరుస్తోంది. కరీంనగర్‌కు చెందిన అర్హయ.. రెండేళ్ల ప్రాయంలోనే సూపర్ టాలెంటెడ్‌ కిడ్‌గా పేరు తెచ్చుకొంది. చిన్నారిలో ప్రతిభను గుర్తించిన తల్లి.. అందుకు అనుగుణంగా శిక్షణ ఇవ్వడంతో.. పలు అవార్డులు అందుకొంది.

Super Kid of The Year
Super Kid Awards
author img

By

Published : Aug 11, 2023, 10:12 AM IST

Karimnagar Talented Kid బాలల్లో మేటి.. మన కరీంనగర్ బేటీ

Karimnagar Talented Kid : చిన్నపిల్లలు వచ్చీరాని మాటలు మాట్లాడుతుంటే విని మురిసిపోతాం.. అలాంటిది చిరుప్రాయంలోనే తన మాటల, చేతలతో ప్రత్యేక ప్రతిభ కనబరుస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ సూపర్ కిడ్​గా రికార్డుల(Super Kid Awards 2023) మోత మోగిస్తుంది ఓ పాపాయి. ఇంతకీ ఆ చిచ్చరపిడుగు ఎవరు... ఆమె సాధించిన ఘనతలు ఏంటో చూద్దామా! ఆ చిన్నారి పేరే.. చిట్టుమల్ల అర్హయ ఉదయ చైతన్య.

Karimnagar Talented Kid Arhaya : కరీంనగర్‌కు చెందిన ప్రశాంతి, అచ్యుత్‌ చైతన్యల గారాల పట్టి. ఈ దంపతులిద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. అమెరికా కంపెనీలో పనిచేస్తున్న వీరు.. ప్రస్తుతం వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. తమ ఏడాదిన్నర కుమార్తెలో ఉన్న ప్రతిభను గుర్తించారు. జ్ఞాపకశక్తి మెండుగా ఉందని గ్రహించిన చిన్నారి తల్లి ప్రశాంతి కాస్త శిక్షణ ఇస్తే చాలు.. మరింత రాటుదేలుతుందని భావించారు. పసిప్రాయంలోనే విభిన్న జంతువులు, వస్తువులకు సంబంధించిన కార్డులను పరిచయం చేశారు.

ఒక్కసారి చూసినా.. చిన్నారి అర్హయ ఆయా అంశాలను ఎప్పుడు అడిగినా.. వెంటనే చెప్పేస్తోంది. అంతేకాదండోయ్! చిట్టి చేతులతో చూడముచ్చటైన పెయింటిగ్​లు సైతం వేస్తూ నివ్వెరపరుస్తుంది. ఏడాదిన్నర వయస్సులోనే అర్హయ ఇంట్లో వస్తువుల పేర్లను చక్కగా గుర్తుంచుకోవడంతో పాటు కొన్ని రోజుల తర్వాత ఎప్పుడు అడిగినా చెబుతుండటంతో పాపలో జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉందని తల్లిదండ్రులు గ్రహించారు. ఆన్‌లైన్‌లో ఫ్లాష్‌కార్డులు తెప్పించి మరింత ప్రోత్సాహించారు.

ఇంట్లోవాళ్లకు చిన్నారి షాక్​.. పిల్లి అనుకుని చిరుత పిల్లను తెచ్చి..

జంతువులు, వస్తువుల బొమ్మలు చదివించగా రెండు నిముషాల్లో 60 బొమ్మల పేర్లు తడబడకుండా చెప్పేసింది. అలాగే 30 సెకన్ల వ్యవధిలోనే ఒక్కో తెలుగు, ఆంగ్ల పద్యాలు చెబుతోంది. ఇలా సుమారు అయిదు వరకు చెప్పగలుగుతోంది. మూడు నెలల్లోనే వంద రకాల ఆర్ట్‌ ఫామ్స్‌ వేయడమే కాకుండా 20 నెలల వయస్సులో వందకు పైగా చిత్రరూపాలు వేసిందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మా మనవరాలు అర్హయ ఉదయ చైతన్య రెండు సంవత్సరాల వయస్సులోనే ఇంతటి చక్కటి ప్రతిభ కనబరిచి ప్రత్యేకంగా నిలవటం మాకెంతో ఆనందంగా ఉంది. మా కోడలు శిక్షణతో అర్హయ.. దాదాపు రెండు నిమిషాల్లోనే అరవై బొమ్మల పేర్లను గుర్తించుకుని చెబుతుంది. ఈ టాలెంట్​కు ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ వారు మెచ్చి అవార్డులు, మెడల్స్, సర్టిఫికెట్​లు ఇచ్చారు. పిల్లల్లో ఉన్న నైపుణ్యాలను వెలికితీసి, ప్రోత్సహించడం ద్వారా మాకు కూడా తృప్తిగా ఉంది. -శ్రీనివాస్‌, చిన్నారి తాతయ్య

Harvest of Awards for Arhaya : ఈ చిన్నారిలో ఉన్న ప్రత్యేక ప్రతిభకు గుర్తించిన ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌(Super Talented Kid Award by International Book of Records) వారు సూపర్ టాలెంటెడ్ కిడ్‌గా అవార్డును అందజేశారు. తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ వారు సైతం యంగెస్ట్‌ ఆర్ట్‌ ప్రాజిడీ అవార్డును అందించారు. ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ నుంచి ప్రశంసాపత్రమూ సాధించింది. ఇంత చిన్న వయసులోనే ఇన్ని ఘనతలు సాధంచిన అర్హయను చూసి కుటుంబసభ్యులు ఎంతో ఆనందపడుతున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమ పిల్లల్లో ఉన్న ఆసక్తిని గుర్తించి.. అందుకనుగుణంగా ప్రోత్సహించాలని చిన్నారి కుటుంబీకులు చెబుతున్నారు.

జూనియర్​ శివమణి.. డ్రమ్స్​ వాయిస్తే ఇంక ఉర్రూతలే

How to become Rich : డబ్బు గురించి మీ పిల్లలకు కచ్చితంగా చెప్పాల్సిన ఐదు పాఠాలివి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.