ETV Bharat / state

రోడ్డు నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశంలో స్మార్ట్ సిటీ పనులపై మేయర్, మున్సిపల్ అధికారులు, కన్సల్టెంట్స్​తో కలెక్టర్ శశాంక సమావేశం నిర్వహించారు. రోడ్ల నిర్మాణ పనులను త్వరితగితన నిర్మించాలని ఆయన ఆదేశించారు.

author img

By

Published : May 3, 2020, 1:54 PM IST

స్మార్ట్ సిటీ పనులపై కలెక్టర్ సమీక్ష
స్మార్ట్ సిటీ పనులపై కలెక్టర్ సమీక్ష

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్మార్ట్ సిటీ పనులపై కలెక్టర్ శశాంక సమీక్ష చేశారు. మేయర్, మున్సిపల్ అధికారులు, కన్సల్టెంట్స్​తో నిర్వహించిన సమావేశంలో కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నగరంలో నడుస్తున్న 17 కిమీల 8 రహదారుల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. స్మార్ట్ సిటీ పనులకు అవసరమైన ఇసుక అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఇసుక లేనందువల్ల పనులకు ఆటంకం ఏర్పడుతుందనే సాకు చెప్పవద్దని సూచించారు. నూతనంగా వేసే రోడ్లలో కరెంటు స్థంభాలను రోజు మార్చి రోజు పక్కకు జరిపి ప్రజలకు ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలని కోరారు.

సుందరీకరణ పనులూ వెనువెంటనే...

రోడ్ల పనులు జరిగే సమయంలో కాంట్రాక్ట్ సిబ్బందితో పాటు ఇంజనీరింగ్ అధికారులు కూడా వారి వెంట ఉండి పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణంలో ఉన్న రహదారుల మాస్టర్ ప్లాన్​కు ముందు, మాస్టర్ ప్లాన్​కు తర్వాత రోడ్ల వెడల్పుల వివరాలు కాంట్రాక్టర్లకు అప్పగించాలన్నారు. రహదారుల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో ఉల్లంఘనలు ఉంటే నివాసాల వారిగా డాక్యుమెంట్లు పరిశీలించాలని కోరారు. ఏమైనా సమస్యలుంటే నోటీసులు అందజేయాలని స్పష్టం చేశారు. నిర్మాణం జరుగుతున్న రహదారుల్లో టౌన్ ప్లానింగ్ అధికారులు 5 రోజుల్లో మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు వెడల్పు వివరాలను కాంట్రాక్టర్లకు అందించాలని వివరించారు. నగర సుందరీకరణ పనులను కూడా వెనువెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

ఇవీ చూడండి : వైద్యసిబ్బందికి కృతజ్ఞతగా ఆసుపత్రులపై పూలవర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.