Students Prepared Eco Friendly Napkins: కరీంనగర్ పారమిత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికలకు గొప్ప ఆలోచన వచ్చింది. మహిళలు రుతుస్రావ సమయంలో వినియోగిస్తున్న సింథటిక్ సానిటరీ న్యాప్‌కిన్స్ వల్ల అనేక రోగాల బారిన పడుతున్నారని తెలుసుకున్న శ్రీహరిణి, శివకీర్తి ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నించారు.
Solution To Women Problems: సానిటరీ న్యాప్‌కిన్స్ తయారీకి ఎలాంటి ముడి పదార్ధాలు వాడతారు..? దాని వల్ల ఆరోగ్యానికి పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయో అధ్యయనం చేశారు. ప్రస్తుతం వినియోగిస్తున్న పదార్ధాలు కాకుండా అరటి, వెదురు నారతో న్యాప్‌కిన్స్ రూపొందించే పనిలో పడ్డారు. బాలికల ఆలోచనకు ఉపాధ్యాయులు సహకరించి అవసరమైన ముడిపదార్ధాలను సమకూర్చారు.
శరీరానికి ఎలాంటి హాని కలగకుండా అతితక్కువ ఖర్చుతో రూపొందించారు. అవార్డులు అందుకోవడంతో పాటు జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యారు. విద్యార్దినులు తయారు చేసిన ఎకోఫ్రెండ్లీ న్యాప్‌కిన్లకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. వీటి వినియోగం పర్యావరణ హితమే కాకుండా మహిళల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
చిట్టి చేతుల్లో ప్రాణం పోసుకున్న ఈ ఉత్పత్తి కుటీర పరిశ్రమగా పలువురికి ఉపాధిని కల్పిస్తుందని భరోసాగా చెబుతున్నారు. పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేశామని, అనుమతి రాగానే చౌకధరలో అందించే ప్రయత్నం చేస్తామంటున్నారు. విద్యార్థుల సృజనాత్మకతను ప్రభుత్వం ప్రోత్సహిస్తే, మరిన్ని ప్రయోగాలు చేసి సమాజంలో సమస్యల పరిష్కారానికి దోహదపడతారని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: