కరీంనగర్ నగరపాలక సంస్థలో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కార్పొరేషన్ పీఠాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెరాస... గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తోంది. మున్సిపాలిటీల్లో తెరాస గెలుపును బాధ్యతగా తీసుకున్న రాష్ట్రమంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్లు... విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండు డివిజన్లలో ఏకగ్రీవమైన అధికార పార్టీ... మిగతా డివిజన్లలోనూ... తమ సత్తా చాటాలని ప్రచారహోరు కొనసాగిస్తున్నారు. నగరపాలక సంస్థ అభివృద్ధికి తెరాసను గెలిపించాలని నేతలు కోరుతున్నారు.
సత్తా చాటేందుకు భాజపా యత్నం...
పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్లో విజయం సాధించిన భాజపా... పురపాలక ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. పార్లమెంట్ఎన్నికల్లో భాజపా గెలుపు గాలివాటం కాదని నిరూపించేందుకు భాజపా ప్రణాళికలు రచిస్తోంది. పురపాలక ఎన్నికల్లో కరీంనగర్లో భాజపాను గెలిచేందుకు ఎంపీ బండిసంజయ్ బాధ్యత తీసుకున్నారు. గతంలో కార్పొరేటర్‌గా పనిచేసిన బండిసంజయ్.... స్థానిక సమస్యలపై చర్చిస్తూ.... పురపాలక ఎన్నికల్లో భాజపాను గెలిపించాలంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
పోరాడేందుకు అవకాశమివ్వండి...
పురపాలక ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కరీంనగర్లో కాంగ్రెస్‌నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కార్పొరేషన్లో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని.... పోరాడేందుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ... కాంగ్రెస్‌నేతలు ప్రచారం చేస్తున్నారు. తెరాస, భాజపాలు మేయర్ అభ్యర్థులను అధికారికంగా ఖరారు చేయకపోయినా.... కాంగ్రెస్ మాత్రం ఇప్పటికే... ప్యాట రమేశ్‌ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు.
గతంలో డిప్యూటీ మేయప్పదవి దక్కించుకున్న మజ్లిస్ ఈసారి 10వార్డుల్లో పోటీ చేస్తోంది. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ఓవైసీ ఇప్పటికే పట్టణంలో ప్రచారం నిర్వహించారు.
బస్తీమే సవాల్: కాలం మారింది..సెల్‌ఫోన్‌తో ఇస్మార్ట్ ప్రచారం..