ETV Bharat / state

'కొత్త కేసులు రాకపోయినా సరే... అప్రమత్తంగా ఉండండి'

కరోనా మహమ్మారి బారిన పడకుండా నగర ప్రజలు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు కచ్చితంగా పాటించాలని కరీంనగర్​ నగర పాలక సంస్థ మేయర్ సునీల్ రావు సూచించారు.

karimnagar-mayor-sunil-rao-groceries-distribution
'కొత్త కేసులు రాకపోయినా సరే... అప్రమత్తంగా ఉండండి'
author img

By

Published : May 18, 2020, 10:53 AM IST

కరీంనగర్​ నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు 40వ డివిజన్ మెహర్​నగర్​ కాలనీవాసులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు పాల్గొని... కార్పొరేటర్ భూమా గౌడ్, మెహర్​నగర్​ అసోసియేషన్ సభ్యులతో కలసి నిత్యావసరాలు అందించారు.

వైరస్ కట్టడిలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని మేయర్ సునీల్ రావు కొనియాడారు. నెల రోజులుగా కరీంనగర్​లో కరోనా పాజిటివ్ కేసులు లేకపోవడం హర్షణీయమన్నారు. అయినప్పటికీ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని కోరారు.

ఇవీ చూడండి: రాష్ట్రానికి అదనపు రుణానికి మార్గం సుగమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.