స్మార్ట్ సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో అభివృద్ధి చేపడతామని కరీంనగర్ మేయర్ సునీల్ రావు అన్నారు. పట్టణంలోని రేకుర్తిలో పలు అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు.
పాలకవర్గం ఏర్పడ్డాక మొదటిసారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నందుకు మేయర్ సంతోషం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో నగరపాలక సంస్థలను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.
ఇవీ చూడండి: నేడు సహకార ఎన్నికలు... సాయంత్రం ఫలితాలు