కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో చేపడుతున్న స్మార్ట్ సిటీ పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని మేయర్ సునీల్ రావు ఆదేశించారు. ఎన్నో సమస్యలతో సతమతమౌతున్న కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో రూ.46 కోట్లు కేటాయించినట్లు మేయర్ వివరించారు. నిధులు వెచ్చించినప్పటికీ పనులు మాత్రం అనుకున్నంత వేగంగా జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాలనీల్లో మురుగు కాల్వలు, రహదారుల కోసం రోడ్లు తవ్వి వదిలేయటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మేయర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 1 నుంచి నగరంలో ప్రతిరోజు నీటి సరఫరా చేయనున్న దృష్ట్యా ఈలోపే పైప్‌లైన్ల నిర్మాణం పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు. ప్రస్తుతం రోగాలు వ్యాప్తి చెందే కాలం కనుక... ఎక్కడా మురుగు నిల్వ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సునీల్‌రావు సూచించారు.