కరీంనగర్‌లోని 50వ డివిజన్లో మేయర్ సునీల్ రావు పర్యటించారు. గణేశ్‌నగర్‌లో శిథిలమైన డ్రైనేజీలను పరిశీలించి.. రూ.10 కోట్లతో నిర్మించేందుకు టెండర్లు నిర్వహించామని చెప్పారు. 11వ డివిజన్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
స్వశక్తి కళాశాల ముందు ఉన్న ప్రధాన మురుగు నీటి కాల్వకు మరమ్మతులు చేపడతామని మేయర్ హామీ ఇచ్చారు. నగరంలో ఉచితంగా కరోనా పరీక్షలు చేసేందుకు శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గౌతమీనగర్‌లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పాలనాధికారి ఆదేశాల మేరకు నగరంలో 15 ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అంజయ్య , ఆకుల నర్మద, నర్సయ్య పాల్గొన్నారు.