రాష్ట్రంలో కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో కరీంనగర్ జిల్లా ఆదర్శంగా నిలిచిందని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ అన్నారు. ఆదివారం నగరపాలక కార్యాలయంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, జిల్లా పాలనాధికారి శశాంక, మేయర్ సునీల్ రావు, కమిషనర్ క్రాంతితో కలిసి సమావేశమయ్యారు. రాష్ట్రంలో మొదటి కరోనా కేసులు ఇక్కడే నమోదైనప్పటికీ.. మిగతా జిల్లాలతో పోలిస్తే జిల్లా సురక్షితంగా ఉందన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న మంత్రి గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్, సీపీ, మేయర్, కమిషనర్‌ను వినోద్‌కుమార్ అభినందించారు. ఇండోనేషియా విషయాన్ని కేంద్రానికి చెప్పింది కూడా తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి, హరిశంకర్ ఉన్నారు.
కరోనా నివారణ చర్యల్లో కరీంనగర్ ఆదర్శం
కరోనా మహమ్మారిని కట్టిడి చేసేందుకు చేపట్టిన చర్యల్లో కరీంనగర్ జిల్లా ఆదర్శంగా నిలిచిందన్నారు ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్. ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని ఆయన అభినందించారు.