కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని రైస్ మిల్లులను కలెక్టర్ శశాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. రబీ కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని సకాలంలో అందించేందుకు వెంటనే మర ఆడించి సిద్ధం చేయాలని రైస్ మిల్లర్ యజమానులను ఆదేశించారు. వానాకాలం బియ్యాన్ని అక్టోబర్ 15న, యాసంగి బియ్యాన్ని అక్టోబర్ 31లోగా అందించాల్సి ఉంటుందని సూచించారు. అవసరమైతే మిల్లులు 24 గంటల్లో రెండు లేదా మూడు షిఫ్టుల్లో నడిపించాలని తెలిపారు.
రైస్ మిల్లు రోజుకు ఎన్ని గంటలు , ఎన్ని షిఫ్టుల్లో నడుపుతున్నారు, ఎంత మంతి కూలీలు పని చేస్తున్నారో ఒక రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. గోదాములకు పంపించే బియ్యం నాణ్యతతో కూడి ఉండాలి స్పష్టం చేశారు.