ETV Bharat / state

సాహస బాలుడికి అభినందనలు..! - karimnagar latest updates

కరీంనగర్​ జిల్లాలో.. ఓ తండ్రి కొడుకు ఇష్టాలను గుర్తించి ఆ వైపుగా ప్రోత్సహించాడు. ఇంకేం.. సాహసానికి వయసుతో పని లేదు అనేలా ఆడిపాడే వయసులోనే పలువురిని ఔరా అనిపిస్తున్నాడు.

Karimnagar district, a ten-year-old boy persevered and made many people feel wow
సాహస బాలుడికి.. అభినందనలు
author img

By

Published : Jan 20, 2021, 12:57 PM IST

కరీంనగర్​ జిల్లాలో ఓ పదేళ్ల బాలుడు పట్టుదలతో సాహసం చేసి పలువురిని ఔరా అనిపిస్తున్నాడు. గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన గూడూరి సంతోష్ రెడ్డి కుమారుడు సిద్ధార్థ రెడ్డి ఐదో తరగతి చదువుతున్నాడు. క్రీడలపై ఆసక్తి చూపించటంతో తండ్రి హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు క్రీడా పాఠశాలలో చేర్పించాడు. వారు ఇచ్చే శిక్షణలో నైపుణ్యం పొంది పిన్న వయసులోనే పర్వతారోహణ చేస్తూ.. పలువురి ప్రశంసలు పొందుతున్నాడు.

అధిరోహించాడు..

ఈ నెల 16, 17న బీసీఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో... కర్ణాటక రాష్ట్రంలో 5735 అడుగుల ఎతైన తాడియాండమాల్ పర్వతంతో పాటు.. 5617 అడుగుల ఎత్తయిన కుమార పర్వతాన్ని అధిరోహించాడు. దానిపై జాతీయ జెండాను ఆవిష్కరించి పలువురిని ఔరా అనిపించాడు. ఈ బాలుడు చేసిన సాహసాన్ని పలువురు అభినందిస్తున్నారు.

ఇదీ చదవండి:జాతి ఐక్యతా ప్రసంగానికి ముందు బైడెన్​​ భావోద్వేగం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.