కరీంనగర్లోని కార్ఖానాగడ్డ జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు డిజిటల్ పాఠాలను ప్రారంభించారు. డిజిటల్ తరగతులపై ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఆన్లైన్ పాఠాలు పరిశీలించారు. కొవిడ్ నేపథ్యంలో సర్కారు బడులు తెరుచుకోలేదు. గత ఐదు మాసాలుగా విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు.
ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు ప్రారంభం కాగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు మొదలు కాలేదు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఆన్లైన్ పాఠాలను నేటి నుంచి ప్రారంభించింది.
ఇదీ చదవండి: స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్టూర్స్కు నగరవాసులు