కరీంనగర్లో 42 పార్కుల నిర్మాణాలకు స్థలాలు సేకరించగా.. 21 పార్కులు అభివృద్ధి చేసేందుకు రూ.5 కోట్లతో టెండర్లు పిలిచినట్లు మేయర్ సునీల్ రావు తెలిపారు. హౌసింగ్ బోర్డు కాలనీలో రూ.26 లక్షలతో చేపట్టే పార్కు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కాలనీని నగరంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
స్మార్ట్ రహదారి పనులను ఆరు నెలలోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 24 గంటల నీటి సరఫరా చేసేందుకు హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు.
- ఇదీ చూడండి : మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారం: జగదీశ్‌రెడ్డి