ETV Bharat / state

పరిసరాల పరిశుభ్రతపై మేయర్ సునీల్ రావు అవగాహన

సీజనల్ వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రత పాటించాలని కరీంనగర్​ మేయర్ సునీల్ రావు సూచించారు. కరీంనగర్​ భగత్​నగర్​లో పది గంటల పది నిమిషాలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Breaking News
author img

By

Published : Aug 23, 2020, 3:11 PM IST

ప్రతి ఆదివారం పది గంటల పది నిమిషాల కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై కరీంనగర్​ మేయర్ సునీల్ రావు ప్రజలకు అవగాహన కల్పించారు. భగత్​నగర్​లోని పలు కాలనీల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరు శుభ్రత పాటించాలని సూచించారు.

ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మాస్కులు ధరించాలని, బయటికు వెళ్లి వస్తే ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, నగరంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారని మేయర్ సునీల్ రావు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.